తినడానికి ఆహారం లేక రాళ్లు వండింది

175

  8 మంది పిల్లలున్న ఆమె ఇళ్ళలో పనిచేసి పిల్లలను పోషించుకునేది. లాక్‌డౌన్‌తో ఆమెకు ఉపాధి కరువై ఇంట్లో వండుకోవడానికి ఏమిలేవు. ఆకలికి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే నీళ్లున్న ఓ పాత్రను పొయ్యిమీద పెట్టి, అందులో రాళ్లు వేసి ఉడికించిందా తల్లి.

https://i.imgur.com/LRKFRfJ.jpg

  కడుపు నిండా తింటామన్న ఆశతోనైనా వారు ఏడుపు ఆపేస్తారనే ఆశతోనే ఇలా రాళ్లను ఉడికించానన్నది ఆ నిస్సహాయురాలు. గుండెలను పిండేసే ఈ ఘటన కెన్యాలోని మోంబసా కౌంటీలో ఓ గ్రామంలో వెలుగుచూసింది.

https://i.imgur.com/6pvhiri.jpg

 కిట్సావో అనే మహిళ భర్త గత ఏడాది ఓ దోపిడీదారు చేతిలో హత్యకు గురయ్యాడు. 8 మంది పిల్లలతో కరెంటు, నీళ్లు లేని ఓ ఇంట్లో కిట్సావో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. పిల్లల ఏడ్పు విని పొరుగింటి వ్యక్తి వెళ్లి చూసే సరికి ఆమె పొయ్యి మీద రాళ్లు ఉడికిస్తోంది. ఆ కుటుంబం దయనీయస్థితిని ఆయన మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో బయటి ప్రపంచానికి తెలిసింది.

https://i.imgur.com/J5Ya26t.jpg

  చలించిపోయిన  కెన్యా ప్రజలు, ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. కిట్సావోకు ఫోన్లు చేసి ఏం సాయం కావాలన్నా చేస్తామని చెబుతున్నారు. దేశ ప్రజలు తన పట్ల ఇంత ఔదార్యాన్ని స్పందిస్తారని తాను ఊహించలేదు అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.