రాఘవ లారెన్స్ పై నెటిజన్ల ప్రశంసలు

385

  నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణికి తనవంతు సాయం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.

https://i.imgur.com/AmLabdr.jpg

  డెలివరీ స్టేజ్‌లో ఉన్న తన భార్య ఇబ్బందులు పడుతోందని ఆమె భర్త లారెన్స్‌ సాయం కోరాడు. లారెన్స్‌ తమిళనాడు ఆరోగ్య మంత్రి పీఏతో మాట్లాడి ఆ గర్భిణికి సాయం చేయమని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు.

  ఆమెకి కరోనా ఉండటంతో వైద్యులు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాడారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి లారెన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని.. తల్లి చికి​త్సలో ఉందన్నాడు.

  ఇక లారెన్స్‌ సహాయానికి సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక లారెన్స్‌ రూ. 3కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.