ఒక్క ట్వీట్ తో 14 బిలియన్ డాలర్ల నష్టం..!

216

   టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ చేసిన ఒకే ట్వీట్ ఆ సంస్థకు ఏకంగా 14 బిలియన్ల డాలర్ల (లక్ష కోట్ల రూపాయలు) నష్టాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు తన సొంత వాటాలో 3 బిలియన్ డాలర్లను కూడా పోగొట్టుకున్నాడు ఎలన్ మాస్క్. ఇక, అసలు విషయానికి వస్తే “టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ,” అంటూ ట్వీట్ చేశారు ఎలన్ మాస్క్.

https://i.imgur.com/9QUD1H2.jpg

  ఆయన ట్వీట్ చేసేంది ఆలస్యం అన్నట్టుగా ఒకరితర్వాత ఒకరు ఆ కంపెనీ షేర్ల నుంచి వైదొలిగారు. దీంతో ఆ కంపెనీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 2018లో కూడా న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో టెస్లా యొక్క భవిష్యత్తు గురించి ఒక ట్వీట్ చేయగా అది ఏకంగా 20 మిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

https://i.imgur.com/vda6AVP.jpg

  అయితే, షేర్ విలువ ఎక్కువగా ఉందని ట్వీట్ చేసింది నిజమేనా? అని వాల్‌స్ట్రీట్ జర్నల్ సంప్రదించగా.. కాదని సమాధానం ఇచ్చారు. మరోవైపు, టెస్లా యొక్క షేర్ ధర ఈ సంవత్సరం పెరిగింది, ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల విలువను 100 బిలియన్ డాలర్ల దగ్గరగా ఉంచింది, ఇది వ్యవస్థాపకుడికి వందల మిలియన్ డాలర్ల బోనస్ చెల్లింపును అవకాశం కల్పించింది.. కానీ, అతని ట్వీట్‌తో పరిస్థితి అంతా మారిపోయింది.

  • 5
    Shares