నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్..

437

  టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

https://i.imgur.com/ZYXy5Bk.jpg?1

  బీపీ డౌన్ కావడంతో శివాజీ రాజాకు గుండెపోటు వచ్చిందని ఆయన స్నేహితుడు, నిర్మాత సురేష్ కొండేటి వెల్లడించారు. శివాజీ రాజాకు స్టంట్ వేస్తారని సురేష్ చెప్పారు.

https://i.imgur.com/fuGhlSs.jpg
ప్రస్తుతం శివాజీ రాజా వయసు 58 సంవత్సరాలు. 400కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, టీవీ సీరియల్స్‌లోనూ నటించారు.

https://i.imgur.com/yOvNBQU.jpg

  ‘అమృతం’, ‘ఆలస్యం అమృతం విషం’, ‘మిస్టర్ రోమియో’, ‘పండు మిరపకాయ్’, ‘పాపం పద్మనాభం’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సీరియల్స్‌తో మెప్పించిన శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు నంది అవార్డులు అందుకున్నారు.