చిరుత నుంచి తప్పించుకొని ఇంటి పైకప్పు నుంచి ఇంట్లో పడ్డ జింక!

443

  అర్ధరాత్రి ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి ఓ జింక ఇంట్లోకి పడిపోయింది. దీంతో, పెద్ద శబ్దం రావడంతో ఆ ఇంట్లోని  కుటుంబసభ్యులు ఉలిక్కిపడి లేచారు.

https://i.imgur.com/fojZ3Z8.jpg

  ఈ సంఘటన మహారాష్ట్ర, ముంబైలోని పోవాలి ప్రాంతంలో జరిగింది. ఓ మచ్చల జింకను చిరుత వేటాడుతుండటంతో దాని నుంచి తప్పించుకునేందుకు ఒక ఇంటి పైకప్పు మీదకు దూకింది.

https://i.imgur.com/eysQW5A.jpg

  ఈ క్రమంలో ఆ ఇంటి పెంకులు పగిలిపోవడంతో ఇంట్లోకి పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖాధికారులకు ఆ కుటుంబసభ్యులు తెలిపారు.

https://i.imgur.com/ClyBguC.jpg

  అక్కడికి చేరుకున్న అధికారులు ఆ జింకను పట్టుకుని తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలివేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్ గా మారాయి.