రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం?

319

  సీనియర్ సినీనటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పోలీసులకు దొరికింది. రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (TN07Q 0099) ను నిన్న రాత్రి చెన్నైలో అధికారులు తనిఖీ చేయగా కారులో ఎక్కువ మొత్తంలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు.

https://i.imgur.com/z730iMM.jpg

  చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల చేసిన తనిఖీల్లో 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. భారీ మొత్తంలో మద్యం ఉండటంతో అధికారులు ఆమె వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ సెల్వకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు.

https://i.imgur.com/y971Gni.jpg

  విషయం తెలిసిన వెంటనే రమ్యకృష్ణ డ్రైవర్ ను బెయిల్ పై తీసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. బాహుబలి సిరీస్ సినిమాలతో అన్ని భాషల్లో భారీగా గుర్తింపు రావడంతో రమ్యకృష్ణకు కోలీవుడ్ , టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అంధాధూన్, రంగమార్తాండ సినిమాలలో నటిస్తున్నారు.

  • 9
    Shares