చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్ కు కరోనా…?

177

  తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్‌కి కరోనా సోకింది.

https://i.imgur.com/dqbpRra.jpg

  గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తిని విధుల నిమిత్తం గత నెల 5న హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బాబు ఇంటి వద్ద బందోబస్తులో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఈ నెల 7న బాపట్లకు తిరిగి వచ్చారు.

https://i.imgur.com/XXF7AyM.jpg?1

  ఆయనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో మూడు రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతడికి వైరస్ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో విధులు నిర్వహించే సమయంలో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతడికి కరోనా సోకినట్లు సమాచారం.

  • 10
    Shares