మరో పదేళ్ళ వరకు కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్ఓ

133

   కరోనా ప్రభావం మరో పదేళ్ళ పాటు ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా గత కొంతకాలంగా అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. అంతేకాదు చాలా మంది ఉపాధి కూడా కోల్పోయారు.

   ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఏకంగా మరో పదేళ్ళ పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థడైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ హెచ్చరించారు.

   ఇటీవల కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ అత్యవసరంగా సమావేశమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రభావం పదేండ్ల పాటు ఉంటుంది.

   మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలి. ఇటువంటి వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయి. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని’ ఆయన పేర్కొన్నారు.

  • 12
    Shares