వైజాగ్ హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది…

98

    విశాఖ లోని హిందూస్తాన్‌ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా క్రేన్‌ కుప్ప​కూలిపోవడంతో పదకొండు మంది కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

    గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.   హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు.

   హిందుస్తాన్‌ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు.

  • 6
    Shares