కంగనా ఇంటి బయట కాల్పుల కలకలం

135

   కంగనా ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తున్నాయి. శుక్రవారం రాత్రి తన ఇంటి సమీపంలో గన్ ఫైర్ చేసిన శబ్దం వినిపించిందని, ఆ సమయంలో తనకు వెంటనే ప్రాణభయం ఏర్పడిందని ఫిర్యాదులో తెలిపారు.

https://i.imgur.com/ZZZuxuJ.jpg

   ఆమె ఫిర్యాదుపై కులూ జిల్లా పోలీసులు వెంటనే స్పందిచి ప్రాంతంలో కొంతమంది సిబ్బందిని సెక్యూరిటీగా నియమించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి సమయంలో ఆమె బెడ్రూంలో ఉండగా ఇంటికి గోడకు దగ్గరలో యాపిల్ చెట్లు చెరువు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతం నుంచి బాంబులు పేలినట్టు భారీగా శబ్దం వినిపించిందన్నారు.

https://i.imgur.com/ya3pSJE.jpg

   మొదట టపాసులే అనుకున్నా కానీ రెండోసారి గన్ పేలిన సౌండ్ వినిపించిందన్నారు. అప్పుడే సెక్యూరిటీని పిలిచి అప్రమత్తం చేశాను అని తెలియజేశారు. యాపిల్ తోటలో గబ్బిలాలను చంపేందుకు ఎవరైనా రైతులు సౌండ్ చేశారేమో అని సెక్యూరిటీ చెప్పాడు. ఆ సౌండ్ విన్న ఆమె కుటుంబ సభ్యులందరూ అది గన్ సౌండే అని నమ్మకాన్ని వచ్చారని తెలిపారు.

https://i.imgur.com/dwSxq5C.jpg

   సెకండ్స్ లోనే రెండుసార్లు ఫైర్ అయింది. అయితే బాలీవుడ్ వారు ఎవరైనా నాపై పన్నాగం పన్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనుషులను సెట్ చేసి ఉంటారు. ముందే ఏడెమిది వేలకు చంపేవారు కూడా ఈ ప్రాంతంలో ఉంటారని తెలియజేసింది. అయితే కంగనా వెంటనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం కొడుకుతో కూడా మాట్లాడారు.

https://i.imgur.com/3A7WQ4c.jpg

   ఆయనకు జరిగిన విషయం చెప్పి పోలీసులను అప్రమత్తం చేసారంట. వారు స్థానిక వాహనాలను అపరిచితులను పరిశీలిస్తూ విచారిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మరి నిజంగా ఇది ఎవరిదైనా ప్లానా.. లేక తోటలో గబ్బిలాల కోసం పేల్చరా..? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.