అతనినే పెళ్లి చేసుకుంటానంటున్న అనుష్క శెట్టి

2968
Anuskha Shetty

      ఇప్పుడున్న కథానాయికల్లో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్స్‌లో అనుష్క(Anushka Shetty) ఒకరు. 2005 లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘మీరు ఎవరితోనే ప్రేమలో ఉన్నారట అన్న ప్రశ్నకు’.. ఒక్కసారిగా స్వీటీ కస్సుమంది.

     అంతకుముందు వరకూ ప్రభాస్‌తో పెళ్లని వార్తలు క్రియేట్ చేశారు. ఆ తరువాత స్వీటీ(Anushka Shetty) ఎవరినో లవ్ చేస్తుందన్నారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమ వ్యవహారం సాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల పట్ల తాను విసిగిపోయానని.. అసలు ఎందుకు తన గురించి ఇలాంటి వదంతులు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. తనపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధగా ఉందని తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. మా తల్లిదండ్రులు ఎవరినైతే.. వివాహం చేసుకోమని చెబుతారో.. అతనినే పెళ్లి చేసుకుంటానని’ పేర్కొంది అనుష్క.

  • 2
    Shares