అమ్మాయిల హాస్టల్లో మంచం కింద అబ్బాయి…నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం..

1899

     నూజివీడు ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్‌ (Ladies Hostel iiit) గదిలోకి ఓ యువకుడు దూరి దాదాపుగా అక్కడే 12 గంటల పాటు ఉన్నాడు. ఆ గది కిటికీ ఊచలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు యువకుడు. కళాశాలలో ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు టెక్ ఫెస్ట్ నిర్వహించారు. అందరూ ఆ హాడావుడిలో ఉండగా, అదే కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో చొరబడ్డాడు.

   అయితే గదిలో ఉన్న మిగతా నలుగురు అమ్మాయిలు రూమ్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అలా బయటకు వెళ్లిన అమ్మాయిల్లో ఒకరు ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలపడంతో వారు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా మంచం కింద యువకుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడు హాస్టల్లోకి (Ladies Hostel iiit) ప్రవేశించేందుకు విద్యార్థినుల ప్రమేయం ఉందని నిర్ధారించిన యాజమాన్యం ఆరుగురిని సస్పెండ్ చేసింది.

  • 7
    Shares