కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

53

    ఒకపక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. మరో వైరస్ (corona virus)  దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేషియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ ఉందేమోనన్న అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్రం అవుతుండటంతో జబ్బు కన్ఫామ్ అవకముందే కరోనా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. వ్యాధి ఒకటి అయితే మందొకటి వేస్తే ఎలా. ట్రీట్మెంట్ పనిచేయక ప్రాణాలు వదిలాడు.

    మలేషియాలో ఇప్పటికే 25 మంది కరోనా వైరస్‌కు (corona virus) గురైనట్లు వైద్యులు తేల్చారు. అదే అనుమానంతో మలేషియా నుంచి వచ్చిన వ్యక్తికి టెస్టులు చేయడంతో రిపోర్టుల్లో వైరస్ లేదని వచ్చింది. కేరళవాసి మృతి చెందడం పట్ల వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. అతనికి షుగర్ ఉందని.. రక్త నమూనాలతో ఇతర పరీక్షలు జరిపి మృతికి కారణాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.