మతిస్తిమ్మితం లేక రోడ్లపై తిరుగుతున్న మిలిటరీ మేజర్ పిల్లలు

580

   ఆమె పేరు అంజలీ.. ఎమ్ఏ చదివింది.. పదేళ్లుగా చింపిరి దుస్తులుతో వీధుల్లో భిక్షాటన చేస్తోంది.. తమ్ముడు ఎంటెక్.. అతడూ కుప్ప తొట్టెల్లో పాచి పారేసిన తిండి కోసం వెదుకుతూ అక్కతోనే ఉంటాడు. పదేళ్లుగా ఇద్దరినీ పిచ్చి అనుకునేవాళ్ళు.. వాళ్ళెవరో ఎవరికీ తెలియదు.. వాళ్లిద్దరూ ఓ వీరుడి సంతానం.. తండ్రి పేరు బిపిన్ చంద్ర భట్.. మిలిటరీ మేజర్.. పాక్ పోరాటంలో సౌర్య పతక వీరుడు.. ఓ రోజు భార్యతో కారులోవస్తూ ప్రమాదానికి గురై ఇద్దరూ చనిపోయారు.. ఆ తరువాత వారానికి పెద్దక్క చనిపోయింది..   దీంతో అక్కతమ్ముడు మెంటల్ షాక్ తో ఇంటిలోనే ఉండిపోయారు.. తలుపులు మూసి బయట ప్రపంచానికి దూరమయ్యారు.. ప్రభుత్వం, బంధువులు కూడా పట్టించుకోలేదు.. చివరకు ఆకలికి తాళలేక వీధుల్లో భిక్షాటన మొదలు పెట్టారు (major children begging).. తిండిలేక అక్క తమ్ముడు నీరసించి చావుకు దగ్గరపడ్డారు..

   ఈ పరిస్థితుల్లో ఓ రోజు వారి తండ్రి మేజర్ బిపిన్ చంద్ర దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి అంజలిని ప్లాట్ ఫారం పై సొమ్మసిల్లి ఉండగా చూసాడు.. చిన్నప్పుడు ఆమెను ఎత్తుకొని తిప్పేవాడు.. బాగా నీరసించి చావుకు దగ్గరాగా ఉన్న ఆమెలో 15 ఏళ్లక్రితం పోలికలు చూసాడు.. అనుమానం వచ్చి విచారించగా వాళ్లిద్దరూ ఒకప్పటి తన అధికారి బిడ్డలేనని నిర్దారించుకొని పైఅధికారులకు చెప్పాడు.. ప్రభుత్వం కూడా వెంటనే కదిలింది.. వాళిద్దర్నీ ఆసుపత్రిలో చేర్చింది. ఇద్దరూ స్క్రిజోపెనీయా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కోలుకుంటున్నప్పటికి మరో ఆరునెలల కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. వారిద్దరి బాగోగులను పై అధికారులు చూస్తున్నారు.. తండ్రికి రావాల్సిన బకాయిలు వాళ్ళ పేరుతో జమ చేశారు. వాళ్లిద్దరూ పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చిన తరువాత వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. విధి వికృత క్రీడలో ,తల్లిదండ్రులు, తోబుట్టువు దూరమై, బ్రతుకు భారమై, మానసికంగా కుంగిపోయి, పిచ్చి వాళ్ళుగా మారి, చావుకు దగ్గర పడ్డ వాళ్లిద్దరి జీవితంలో పదేళ్ళ చీకటి తరువాత వెలుగురేఖ కనిపించింది.. సినిమా కధ లాంటి ఈ నిజం జైపూర్ లో జరిగింది. ఈ సందేశం సరోజినీ వైషు నుండి సేకరించబడినది.

  • 9
    Shares