రెండు చానళ్లపై 48 గంటల నిషేధం ప్రకటించిన కేంద్రం

88

    ఢిల్లీ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు రెండు మలయాళ చానళ్లపై (News Channel) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటలపాటు నిషేధం విధించింది. నిషేధానికి గురైన వాటిలో ఏషియా నెట్‌ మరియు మీడియా వన్‌ చానళ్లు ఉన్నాయి. ఈ రెండు చానళ్లు గొడవలు జరుగుతున్న రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేవిధంగా రిపోర్టింగ్‌ చేశాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా ప్రసారాలు చేసినందుకు శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు చానళ్ల ప్రసారాలపై (News Channel) నిషేధించింది. అలాగే ఢిల్లీ అల్లర్ల కవరేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని చానళ్ల ప్రసారాలను సమచార శాఖ నిశితంగా పరిశీలిస్తుంది.

   కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరెగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 53 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.