Home Cinema రాహుల్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన ప్రకాష్‌ రాజ్‌

రాహుల్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన ప్రకాష్‌ రాజ్‌

212
   బిగ్ బాస్ విన్నర్ రాహుల్‌ మీద పబ్‌లో జరిగిన దాడిపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakashraj Rahul) ఘాటుగా స్పందించారు. కాగా రాహుల్‌ పై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రిషిక్‌ రెడ్డి గచ్చిబోలి లోని ప్రిజమ్‌ పబ్‌లో దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడిలో రాహుల్‌ తలపై ఎమ్మెల్యే సోదరుడు బీరు బాటిల్ పగలగొట్టాడు. దాంతో అతడి తలకు గాయం కాగా అతన్ని వెంటనే పబ్‌ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుండి బయటికి వచ్చిన అనంతరం రాహుల్‌ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మీడియా ముందు అన్నాడు. ఈ విషయంపై రాహుల్‌ కేటీఆర్‌కు సైతం ట్వీట్‌ చేసి నేను టీఆర్‌ఎస్‌ అభిమానినే నాకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

   రాహుల్‌ పై జరిగిన దాడిని ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కూడా వ్యతిరేఖిస్తూ ట్వీట్‌చేశారు. రాహుల్‌కు న్యాయం జరగాలని సింగర్ నోయల్‌, వరుణ్ సందేశ్‌ పోస్ట్‌లు పెట్టారు. అయితే ఈ దాడిపై స్పందించిన ప్రకాశ్‌రాజ్‌ రాహుల్‌కు (Prakashraj Rahul) అన్యాయం జరిగిందని అన్నారు. పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌ తప్పేమీ లేదని తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. వినయ్‌ భాస్కర్‌ను కలవడంలో ఈ కేసుకు సంభందం లేదని స్పష్టం చేశాడు. కేసు కాంప్రమైజ్‌ కోసం వినయ్‌ భాస్కర్‌ను కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాహుల్‌ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్‌ కావాల్సిన అవసరమేంటన్నారు.

  • 15
    Shares