విమాన సర్వీసుల రద్దుతో జర్మనీలో చిక్కుకుపోయిన వరల్డ్ ఛాంపియన్

248
విశ్వనాథన్ ఆనంద్

   కరోనా వైరస్ భయంతో విమాన సర్వీసుల రద్దు చేయడంతో చెస్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీ దేశంలో చిక్కుకుపోయారు. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీ దేశంలోని బుండెస్లిగాలో చెస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు వెళ్లగా ఈ చెస్ టోర్నమెంటు అనంతరం సోమవారం ఈయన తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో జర్మనీ దేశం నుంచి భారతదేశానికి విమానాల రాకపోకలను ముందస్తు చర్యగా రద్దు చేశారు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

   ‘‘కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరినీ ప్రమాదంలో పడేయకుండా విమానసర్వీసులను రద్దు చేయడం సరైనదే’’ అని ఆనంద్ భార్య అరుణ చెప్పారు. తన భర్త విశ్వనాథన్ ఆనంద్ ఎప్పుడు స్వదేశానికి తిరిగివస్తారోనని నేను ఎదురు చూస్తున్నానని అరుణ చెప్పారు. చైనా దేశంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. యూరప్ దేశాలతోపాటు మన దేశంలోనూ కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది.

  • 4
    Shares