రేంజ్ రోవర్ నే గిఫ్ట్ గా ఇచ్చేశాడు.. Prabhas Range Rover Gift

110
prabhas range rover gift

 తన కోసం పని చేసేవారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ప్రభాస్‌కు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా శ్రద్ధా కపూర్ సాహో చిత్రంలో తన సరసన నటించేందుకు అంగీకరించినందుకే ఇంటి నుంచి 20 రకాల వెరైటీలతో క్యారేజీ రెడీ చేసి వడ్డించాడు.

prabhas range rover gift

 ఆ తర్వాత ఖరీదైన కానుకలెన్నో ఇచ్చాడు. తన సాటి నాయికలకు చాలాసార్లు గిఫ్ట్ లు ఇచ్చినా దానిపై బయటికి అయితే ప్రకటించుకోడు. ఇక స్నేహితులకు అయితే లెక్కలేనన్ని కానుకలు ఇస్తూనే ఉంటాడు ప్రభాస్.

 విషయానికొస్తే హీరోలకు అందం, అభినయంతోపాటు ఫిట్‌నెస్‌ కూడా చాలా అవసరం. అందుకే నేటితరం హీరోల్లో ఎక్కువ మంది జిమ్ముల్లోనే గడిపేస్తుంటారు. ఫిట్‌నెస్‌ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే వారికి ప్రత్యేక ట్రైనర్లు కావాలి.

prabhas range rover gift

 అలాగే ప్రభాస్‌కు ఓ ప్రత్యేక ట్రైనర్‌ ఉన్నారు. అతని పేరు లక్ష్మణ్‌రెడ్డి. తనకోసం కష్టపడుతున్న జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌కు లక్షల ఖరీదు చేసే రేంజ్‌ రోవర్‌ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కానుక చూసి అంతా ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Prabhas Range Rover Gift