ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో హంగామా ఎంతగానో మిస్సవుతున్నాం :Rajamouli Family Watch V Movie

152
Rajamouli Family Watch V Movie

 అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదలైన V చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. నాని సైకో లక్షణాలను ప్రదర్శించిన తీరు కూడా సూపర్ అనే చెప్పాలి. అయితే తాజాగా ఈ చిత్రాన్ని రాజమౌళి కుటుంబం అంతా కలసి వీక్షించిన ఫొటోను రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Rajamouli Family Watch V Movie

 ” V ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో హంగామా ఎంతగానో మిస్సవుతున్నాం. ఒకవేళ పరిస్థితులు సాధారణంగా ఉండుంటే మేమంతా ఉదయం 8.45 నిమిషాలకు ప్రసాద్స్‌ ఐమాక్స్ లో ఈ సినిమా చూసేవాళ్లం. వి చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ హోం థియేటర్లో సినిమాను చూస్తూ ఆస్వాదించారు.

Rajamouli Family Watch V Movie

మరోవైపు ‘వి’ చిత్ర బృందం కూడా కలిసి ఈ సినిమాను చూసింది. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరీ, ఇంద్రగంటి, దిల్‌రాజు కలిసి ఈ సినిమాను చూశారు.

Rajamouli Family Watch V Movie

ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్న ఫోటో కూడా వైరల్ అవుతుంది.

Rajamouli Family Watch V Movie