ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు : Acid Attack

93
Acid Attack
 ప్రేమించి మోసం చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడుపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన నాగేంద్రకు ముఖంపై గాయాలయ్యాయి.
Acid Attack
 ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సదరు యువతిని నాగేంద్ర ప్రేమించాడు. అయితే ఆమెతో పెళ్లికి అంగీకరించకపోవడమే కాకుండా ఇటీవలే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతి వారం రోజుల క్రితం నాగేంద్రపై యాసిడ్‌తో దాడి చేసింది.
Acid Attack

 అయినా శాంతించని యువతి నేడు మళ్లీ నాగేంద్రపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Acid Attack