న్యూస్ జయప్రకాష్‌రెడ్డికి తెలుగులో సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

జయప్రకాష్‌రెడ్డికి తెలుగులో సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

206
Modi Condoles Death of Jayaprakash Reddy

 కళారంగం అంటేనే ఒక చోటకి సంబండించింది కాదు. కళారంగానికి ఎల్లలు లేవు. నటనకు ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా ఎన్నో మంచి పత్రాలు పోషించి అందరినీ మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్‌తోపాటు, సౌత్‌ పరిశ్రమల ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.

Jayaprakash Reddy Passed Away

 అయితే దేశ ప్రధాన నరేంద్రమోడీ కూడా సంతాపం తెలియజేయడం విశేషం. జయప్రకాష్‌ రెడ్డి హఠాన్మరణంపై మోడీ తెలుగులోనే సంతాపం తెలియజేస్తూ నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా మోడీ స్పందిస్తూ, జయప్రకాష్‌ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నార`ని తెలిపారు.

Jayaprakash Reddy Passed Away

 తన సుదీర్ఘ సినీ యాత్రలో ఎన్నో మంచి పాత్రలు పోషించారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి` అని ట్వీట్‌ చేశారు. మోడీ తెలుగులో సంతాపం చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది.

 Modi Condoles Death of Jayaprakash Reddy