డ్రగ్స్ కేసు : పోలీస్ కస్టడికి రియా.. వైరల్ అవుతున్న సుశాంత్ డ్రగ్ వీడియో..

265
Sushant Unseen Video

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది.

Sushant Unseen Video

 ఈ నెల 21 వరకు ఆమెను కస్టడీకి అప్పగించింది. సుశాంత్‌ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్‌ చాట్‌ను కూడా పరిశీలించారు.

Sushant Unseen Video

 అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటంతో ఈ కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ కేసులో మూడు రోజుల విచారణ తర్వాత రియాని కూడా అరెస్ట్ చేశారు.

Sushant Unseen Video

అయితే ప్రస్తుతం సుశాంత్ డ్రగ్ తీసుకున్న వీడియొలు అంటూ ట్విటర్ లో చెక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియొ లో అందరూ ఫుల్ గా డ్రగ్ తీసుకున్న విధంగా ఉంది అంతేకాకుండా సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నట్టు కనబడుతుంది. మరొక వీడియొలో సుశాంత్ డ్రగ్ తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ వీడియొ జీ న్యూస్ లో ప్రసారమయ్యాయి.

Sushant Unseen Video