‘సైకో వర్మ’ షూటింగ్ షురూ.. హీరోగా దర్శక నిర్మాత తనయుడు

140
psycho varma movie

 సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై తీస్తోన్న ‘సైకో వర్మ’ టాగ్ లైన్ ‘వీడు తేడా’ చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాకు నిర్మాత నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. అనురాగ్‌ కంచర్ల, నట్టి కరుణ నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్‌ గౌతంరాజు క్లాప్‌నిచ్చారు.

psycho varma movie

 దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ ఇది రామ్‌గోపాల్‌వర్మ అభిమాని కథ ఇది. వయోలెన్స్‌, రొమాన్స్‌ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. రామ్‌గోపాల్‌వర్మ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. తన పంథాను మార్చి ప్రస్తుతం వర్మ సినిమాలు తీస్తున్న విధానాన్ని పోలుస్తూ ఓ పాటను బుధవారం నుంచి చిత్రీకరిస్తున్నాం అని తెలిపారు.

psycho varma movie

 నటనకు ఆస్కారమున్న మంచి పాత్రను సినిమాలో పోషిస్తున్నానని ఆ సినిమా హీరో నట్టి క్రాంతి తెలిపారు. డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు. అప్పాజీ, మీనా, రూపలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్‌.ఏ.ఖుద్దూస్‌ అందించబోతున్నారు.

Psycho Varma Movie Shooting