మహా సముద్రం సమంత ప్లేస్‌లో ఐశ్వర్య రాజేష్ ?

89
Aishwarya Rajesh Replace Samantha Role In Mahasamudram

 మహాసముద్రంలో సమంత పోషించే పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ను ఎంపికి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా మొదట్లో సమంతను సంప్రదించగా, పాత్ర నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి.

Aishwarya Rajesh Replace Samantha Role In Mahasamudram

 ‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహా సముద్రం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయనతో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. చాలాకాలం తర్వాత క్రేజీ కాంబోతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్ట్టెంట్ ఉండటంతో సమంత ను తీసుకున్నారు.

Aishwarya Rajesh Replace Samantha Role In Mahasamudram

 ఈ రోల్‌కు ముందుగా ఓకే చెప్పిన సామ్ అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్, సాయిపల్లవిలో ఎవరో ఒకరిని తీసుకోవాలని యూనిట్ భావించింది.

Aishwarya Rajesh Replace Samantha Role In Mahasamudram

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ఛాన్స్ లక్కీగర్ల్ ఐశ్వర్య రాజేష్‌కు దక్కినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం సిద్దార్ధ్ ఎంట్రీ ఆ.. లేక పోతే మరేదైనా కారణం అనేది తెలియదు.

Aishwarya Rajesh Replace Samantha Role In Mahasamudram