పామును చంపి కూర వండుకు తిన్నారు.. చివరకు ఏమైందంటే..

85
Eating for Snake Meat Youth Arrest

ముగ్గురు యువకులు పామును చంపిన విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు తంగమాముని పట్టణంలో 40 సంవత్సరాల శివకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. శివకుమార్ అతని స్నేహితులైన మహ్మద్ హుస్సేన్, సురేష్ లతో ఉన్న సమయంలో ఒక పాము అక్కడికి వచ్చింది. పామును చూసిన వెంటనే వాళ్లు ముగ్గురు కర్రలతో కొట్టి చంపేశారు.

Eating for Snake Meat Youth Arrest

ఆ తరువాత వారిలో ఒకరికి పామును చంపి వండుకుని తినాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా వాళ్లు తమ స్నేహితుడైన జయప్రకాష్‌ కు అసలు విషయం చెప్పి కాళియమ్మన్‌ ఆలయం వెనుక భాగంలో పామును ముక్కలు ముక్కలు చేసి వండుకుని తిన్నారు.

Eating for Snake Meat Youth Arrest

అయితే వాళ్లు అక్కడితో ఆగి ఉంటే ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు. పామును చంపిన తరువాత వాళ్లు సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి అందరికీ పంపారు.

eating for snake meat youth arrest

అయితే వాళ్ల స్నేహితులు వీడియోను వైరల్ చేయడంతో విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది. మేట్టూరు అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

Eating for Snake Meat Youth Arrest

చట్టం ప్రకారం పామును చంపి తినడం నేరమని అందువల్లే వాళ్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు. పామును చంపి ముక్కలుగా చేసి తినడంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Eating for Snake Meat Youth Arrest
  • 3
    Shares