విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. 12 వేల పందులను మట్టుపెట్టడానికి

85
African Swine Flu in Assam

ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉండటంతో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12000 పందులను చంపేయాలని అసోం ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. స్వైన్ ఫ్లూ ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా పందులను చంపినపుడు వాటి యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.

African Swine Flu in Assam

స్వైన్ ప్లూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 వేలకు పైగా పందులు మృతి చెందాయని, మొత్తం 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోందని పశు సంవర్ధక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అసోంలో తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసింది.

African Swine Flu in Assam‘పశు సంవర్ధక శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి శర్వానంద్ సోనేవాల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయానికి కట్టుబడి, ప్రభావిత జిల్లాల్లో పందుల సంతతిని ముట్టుబెట్టే కార్యక్రమం దుర్గా పూజకు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు’ అని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

African Swine Flu in Assamమొత్తం 14 జిల్లాల్లో వైరస్‌కు కేంద్రంగా ఉన్న 30 ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలోని పందులను చంపనున్నట్టు తెలిపారు. పందుల యజమానులకు బ్యాంకు ఖాతాల్లో పరిహారం డిపాజిట్ చేయనున్నారు. 2019 నాటికి అసోంలో మొత్తం 21 లక్షల పందులుండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు.

African Swine Flu in Assam