కంగనా కు సమన్లు ఎందుకు ఇవ్వలేదు.. నగ్మా.!

85
kangana-ranaut-nagma

సుశాంత్ సింగ్‌ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో దీనిపై విచారణ జరుపుతోన్న అధికారులు కొంతమంది సినీ ప్రముఖులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఒకప్పుడు తాను డ్రగ్స్‌ వాడానంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్ చెప్పినప్పటికీ ఆమెకు అధికారులు సమన్లు ఎందుకు ఇవ్వలేదని సినీ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా ప్రశ్నించారు.

nagma-why-hasnt-ncb-summoned-kangana-ranaut-who-admitted-to-taking-drugs

కేవలం వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు ఇచ్చారని, మరి బహిరంగంగా అంగీకరించిన కంగనా రనౌత్‌కు మాత్రం ఎందుకు సమన్లు పంపలేదని నగ్మా నిలదీశారు. డ్రగ్స్‌కు సంబంధించి సెలబ్రిటీల సమాచారాన్ని మీడియాకు అందచేసి ప్రజల్లో వారి పరువు తీయడమే NCB అధికారుల ఉద్యోగమా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

nagma-why-hasnt-ncb-summoned-kangana-ranaut-who-admitted-to-taking-drugs

ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది. నటనలో ఆసక్తి ఉండడంతో తాను టీనేజ్‌లో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని, డ్రగ్స్‌కి కూడా బానిసను అయ్యానని తెలిపింది.

Nagma

  • 5
    Shares