సెలబ్రిటీల చాటింగులు ఎలా బయటకు వచ్చాయి..! అసలు వాట్స్ ఆప్ సేఫేనా..?

78
Rhea Deepika Chat Leak is Whatsapp Really Safe

మనం వాట్సాప్ తెరిచి సందేశాలను పంపినప్పుడల్లా ‘This chat is end-to-end encrypted and safe’ అనే పంక్తులను తరచుగా చూస్తాము. రియా చక్రవర్తి స్క్రీన్ షాట్ లు.. టాలెంట్ మేనేజర్ తో చాట్ చేసిన వైనం.. ‘మాల్’ సంపాదించడం గురించి టాలెంట్ మేనేజర్ తో దీపికా పదుకొనే చాట్ చేయడం వంటివి బయటికి రావడంతో వాట్సాప్ సురక్షితమేనా? అని చాలా మంది నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

Rhea Deepika Chat Leak is Whatsapp Really Safe

చాలా మంది సెలబ్రిటీల స్క్రీన్ షాట్ లు అలాగే చాట్ డేటాను మీడియా వర్గాలు ఎలా ఎలా సంపాదించగలుగుతున్నారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఇలా జరగడం వెనక సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా చట్టాలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయన్నది మాత్రం స్పష్టం అవుతుంది. ఒక సామాన్యుడు (మీడియా వ్యక్తులతో సహా) నిజంగా సీక్రెట్ గా వున్న వాట్సాప్ చాట్ లను బయటకు తీసుకురాలేడు. కానీ సిబిఐ- ఎన్.ఐ.ఏ- ఎన్సీబీ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలకు మాత్రమే అలా చేయడానికి అనుమతి వుంది.

Rhea Deepika Chat Leak is Whatsapp Really Safe

ఈ ఏజెన్సీలు వాస్తవానికి సెలబ్రిటీల ఫోన్ లను మాత్రమే క్లోన్ చేస్తాయి. ఫోన్ లోని సమాచారం దానికి సంబంధించిన సర్వర్ నుంచి ఐక్లౌడ్ అండ్ గూగుల్ డ్రైవ్ ద్వారా సేకరించేందుకు ప్రయత్నిస్తాయి. ఇందులో కోడర్లు.. సాంకేతిక నిపుణులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. కాబట్టి వాట్సాప్ ప్రతిఒక్కరికీ సురక్షితమే కాని చట్టాన్ని ఉల్లంఘించిన తరువాత దర్యాప్తు సంస్థలు మీకు వ్యతిరేకంగా చాట్లను కోర్టులో ఉపయోగించాలనుకుంటే సాక్ష్యంగా పనిచేయవచ్చు. మరోవైపు వాట్సాప్ చాట్లను న్యాయస్థానాలలో సాక్ష్యంగా తయారు చేయవచ్చు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలకు అలా చేయటానికి సర్వాధికారాలున్నాయి.

Rhea Deepika Chat Leak is Whatsapp Really Safe