భార్య అడిగిందని పొలం అమ్మి ఏనుగు కొన్నాడు..

55
Buy An Elephant Fulfilling Wife Dream

బంగ్లాదేశ్‌లోని లాల్మో నిర్హాట్ యొక్క పంచగ్రామ్ యూనియన్ నివాసి దులాల్‌ చంద్ర రాయ్‌ తన భార్య తులసి రాణి దాసి ముచ్చట తీర్చటం కోసం చేసిన కొనుగోలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దులాల్ భార్యకు తాము ఓ ఏనుగును కొన్నట్టు.. దానిని పెంచుకుంటున్నట్టు ఏడాది క్రితం కల వచ్చిందట. దాంతో ఏనుగును పెంచుకోవాలని ఆమె భావించింది.

Buy An Elephant Fulfilling Wife Dream

కాగా, భార్య సరదా తీర్చటం కోసం దులాల్‌ తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి.. వచ్చిన 16.5 లక్షల టాకాలతో ఓ ఏనుగును కొనుగోలు చేశాడు. దానిని ఇంటికి తీసుకొచ్చేందుకు మరో 20,000 టాకాలు ఖర్చు పెట్టాడు.

Buy An Elephant Fulfilling Wife Dream

అయితే తులసికి కలలో జంతువులు కనిపించటం, ఆ జంతువులను వారు కొని, పెంచుకోవటం ఇదే తొలిసారి కాదు.వారు ఇప్పటి వరకు గుర్రం, హంస, మేక లాంటి జంతువులను కొని, వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

Buy An Elephant Fulfilling Wife Dream

ఇప్పుడు ఏనుగు కోసం నెలకు 15,000 టాకాల జీతంతో ఓ మావటిని కూడా నియమించుకున్నారు. ఇక వారి ఏనుగును చూసేందుకు చుట్టుపక్కల వారు పోటెత్తుతున్నారట. భార్య కలను నిజం చేసి, తన ప్రేమను నిరూపించుకునేందుకే తాను ఇదంతా చేసినట్టు దులాల్‌ చంద్ర తెలిపారు.

Buy An Elephant Fulfilling Wife Dream
  • 2
    Shares