పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే మతిపోతుంది

103
Jeera Water Benfits
రోజూ పరగడుపున జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి.
దీనివల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు దరిజేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోజూ జీరా వాటర్ తాగలేని వారు వారానికోసారైనా జీలకర్ర నీటిని సేవిస్తే చక్కని ఫలితం వుంటుందని వారు చెప్తున్నారు. జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యం శుభ్ర‌పడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు వదిలిపోతాయి.
Jeera Water Benfits
క‌డుపులోని నులి పురుగులు ఉంటే చ‌నిపోతాయి. జీలకర్ర నీటిని సేవించడం ద్వారా కిడ్నీలోని రాళ్లు క‌రుగుతాయి. జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది.
Jeera Water Benfits
దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రావు. మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Jeera Water Benfits