అభిమాని చెప్పును చేతితో తీసి ఇచ్చిన స్టార్ హీరో..

75
Ilayathalapathy Vijay Simplicity

సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడులో అంత ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే ఇలయదళపతి విజయ్ అనే చెప్పాలి. గాన గంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకి గాను తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌కు వెళ్లారు హీరో విజయ్.

Ilayathalapathy Vijay

అక్కడికి అభిమానులు కూడా భారీ సంఖ్యలో రావడంతో విజయ్‌ని అభిమానులు చుట్టుముట్టారు. పోలీసుల సహకారంతో విజయ్ బయటపడ్డాడు. విజయ్ బయటకు వెళ్తున్న క్రమంలో ఓ అభిమాని చెప్పు జారవిడుచుకున్నాడు.

Ilayathalapathy Vijay

అది చూసిన విజయ్ ఆ చెప్పును తన చేతితో తీసి అభిమానికి ఇచ్చాడు. ఈ సంఘటన వీడియోలో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్ నీ సింప్లిసిటీకి హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Ilayathalapathy Vijay Simplicity