ఊహించని ఎలిమినేషన్‌.. షాక్‌ అయిన ఇంటి సభ్యులు, ప్రేక్షకులు

79
Devi Nagavalli Elimination

టీవి9 దేవీ నాగవల్లి.. బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తానంటూ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. మొదటి బిగ్ బాస్ లేడి విన్నర్ తానే అవుతానని ముందే చెప్పింది. బయట కూడా ‘దేవీతో అంత ఈజీ కాదు’ అని అందరూ అంటుంటారు. ఇంట్లో కూడా దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు. కరాటి కళ్యాణికి కూడా వెళిపోతూ దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సర్టిఫై చేసింది. అంతేకాదు నామినేట్‌ కూడా చేసింది.

మూడో ఎలిమినేషన్‌గా దేవీ నాగవల్లి బయటకు వచ్చారు. దేవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమెను హౌస్ నుండి బయటకు పంపిస్తున్నట్లుగా నాగార్జున చెప్పారు. దీని కోసం కలర్‌ బాక్స్‌ స్టయిల్‌ వాడారు. ఆఖరిగా ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న కుమార్‌ సాయి, దేవీ నాగవల్లికి రెండు బాక్సులు ఇచ్చారు. అందులో ఒక బాక్సులో ఎరుపు రంగు, ఇంకో బాక్సులో ఆకుపచ్చ రంగు వేశారు.

ఎరుపు రంగు వచ్చినవారు ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున చెప్పారు. అలా దేవీ ఎలిమినేట్‌ అయింది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న దేవి ఎలిమినేట్‌ అవ్వడం నిజంగా షాక్ అనే చెప్పాలి. ఇంకొందరు మాత్రం హౌస్ లో ఎక్కువ గేమ్ ప్లే చేయలేకపోతుంది కాబట్టే బయటకు వచ్చిందని అనుకుంటున్నారు.

దేవి బయటకు రావడం పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను బయటకు పంపి తియ్యవలసిన వాళ్ళను తియ్యకుండా బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ లు  నడిపిస్తున్నారు అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే దేవి ని మళ్ళీ బిగ్ బాస్ లో తీసుకుంటునట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి మరి.

Devi Nagavalli Elimination