ట్రాక్టర్ కి నిప్పు పెట్టి మోది దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు రైతులు..

75
Farmers Protest: Tractor Set On Fire At India Gate In Delhi To

కేంద్రం ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర భారతదేశం లోని రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇండియా గేట్ వద్ద రైతులు నిరసన తెలుపుతూ అక్కడే ఓ ట్రాక్టర్ ను దగ్ధం చేయడంతో కలకలం రేపింది. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Farmers Protest: Tractor Set On Fire At India Gate In Delhi To ...

ఈ ఉదయం 7.15 నుంచి 7.30 గంటల మధ్య వచ్చిన దాదాపు 20 మంది రైతులు అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. చేతిలో భగత్ సింగ్ చిత్ర పటాన్ని పట్టుకుని, వారు ప్రభుత్వ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

Farmers Protest: Tractor Set On Fire At India Gate In Delhi To ...

అమృత సర్ న్యూఢిల్లీ రైల్వే ట్రాక్ పైకి చేరుకున్న వందలాది మంది రైతులు, ధర్నాకు దిగగా, ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. గత బుధవారం నుంచి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో రైల్ రోకో జరుగుతోంది. ఇదిలావుంచితే, ఈ బిల్లులకు రాష్ట్రపతి నిన్న ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారాయి.

Farmers Protest: Tractor Set On Fire At India Gate In Delhi To …