20 రూపాయలు తక్కువ ఇచ్చినందుకు

67
Man Murdered Over 20 Rupees

ఢిల్లీలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం రూ. 20 కోసం ఇద్దరు అన్నదమ్ములు ఓ వ్యక్తిని కన్నకొడుకు ముందే కిరాతకంగా హత్య చేశారు. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే బురారీ ప్రాంతంలో గత గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపేష్ అనే 38 ఏళ్ల వ్యక్తి షేవింగ్ కోసం దగ్గరలో ఉన్న సెలూన్‌ కు వెళ్లాడు. షేవింగ్‌కు రూ. 50 అయితే రూ. 30 ఇచ్చి మిగతా రూ. 20 తరువాత ఇస్తానని చెప్పాడు. సెలూన్ యజమాని సంతోష్ దీనికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది.

Man Murdered Over 20 Rupees

ఇదే సమయంలో సంతోష్ సోదరుడు సరోజ్ కూడా అక్కడకు చేరుకుని రూపేష్‌ పై దాడికి దిగాడు. తన తండ్రిని వదిలేయమని రూపేష్ కొడుకు ఎంత ప్రాధేయపడినా ఇద్దరు సోదరులు పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ప్లాస్టిక్ పైప్ తీసుకుని రూపేష్‌ పై దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో రూపేష్ ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలోనే రూపేష్ మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా.. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

Man Murdered Over 20 Rupees