పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి నానమ్మ ని కాపాడుకున్న మనమడు..

87
Caught on camera: Haryana boy saves grandmother from bull ...

ఒక పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి తన నాన్నమ్మను కాపాడటంతో అందరూ ఆ పిల్లడిని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధ మహిళను ఒక ఎద్దు ఒక్క ఉదుటున పొడిచి కిందపడేసింది. దాంతో వెంటనే అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఆమె మనుమడు పరిగెత్తుకుంటూ వాళ్ల నాన్నమ్మ దగ్గరకు వచ్చాడు. ఆ ఎద్దు ఆ పిల్లవాడిని కూడా పొడిచి నేలపై పడేలా చేసింది.

Caught on camera: Haryana boy saves grandmother from bull ...

అయితే భయంతో ఆ బాలుడు పారిపోకుండా వాళ్ల నాన్నమ్మను పైకి లేపాడు. అంతటితో ఆగకుండా ఆ ఎద్దు ఆగలేదు మళ్లీ వారిని పొడిచింది. ఈ లోపు చుట్టు పక్కల వారు వచ్చి వారిని ఎద్దు బారి నుంచి వారిని కాపాడారు. ఎద్దు దాడి చేస్తున్న భయపడకుండా తన నాన్నమ్మను కాపాడిన పిల్లోడి ధైర్యసాహసాలు, నాన్నమ్మ పట్ల ఉన్న ప్రేమ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పిల్లవాడిని పొగడ్తాలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

Caught on camera: Haryana boy saves grandmother from bull …