థియేటర్లలో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా నాదే!

94
RGV Coronavirus Movie Release first on Theaters

అన్లాక్ 5 లో భాగంగా అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సంచలన దర్శక నిర్మాత RGV సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ సినిమా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.

RGV Coronavirus Movie Release first on Theaters

ఏప్రిల్ మే నెలల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఎవరికి అనుమతి లేని సమయంలో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు వర్మ. ఎక్కడ ఎప్పుడు ఎలా చిత్రీకరణ చేశాం అనేది చెప్పలేదు కానీ కరొన నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేశానని వర్మ చెప్పారు. ఇప్పుడు ఆ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

RGV Coronavirus Movie Release first on Theaters

“మొత్తం మీద అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత విడుదల అయ్యే తొలి సినిమా ‘కరోనా వైరస్’ అని ప్రకటించడానికి సంతోషపడుతున్నాను” అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అగస్త్య మంజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రధారి గా నటించారు.

RGV Coronavirus Movie Release first on Theaters