అందుకే ఆచార్య నుంచి తప్పుకున్నా : త్రిష

119
Trisha Acharya Movie
Trisha Hot Stills Photos

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అయితే ముందు ఈ పాత్ర కోసం త్రిష‌ని ఎంపిక చేసిన అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం నుంచి త్రిష త‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Trisha Acharya Movie

త‌రువాత త‌ను ఈ చిత్రం లో నటించడంలేదని, కొన్ని సృజ‌నాత్మ‌క విభేధాల కార‌ణంగానే తాను త‌ప్పుకున్నాన‌ని వెల్ల‌డించింది. అంతే కాకుండా కొన్ని ముందు చెప్పిన‌ట్టుగా వుండ‌వ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకిచ్చింది.

Trisha Acharya Movie

దీంతో `ఆచార్య‌` టీమ్ చిరుకు జోడీగా చాలా మంది హీరోయిన్‌ల‌ని ప్ర‌య‌త్నించి చివ‌రికి రామ్‌చ‌ర‌ణ్ చొర‌వ‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఫైన‌ల్ చేశారు. ఇదిలా వుంటే ఈ టీమ్‌ పై మ‌రోసారి త్రిష కామెంట్ చేసిన‌ట్టు తెలిసింది.

Trisha Acharya Movie

‘కొన్ని విషయాలు మనం ఊహించినట్టుగా జరగవు. నచ్చని విషయాల్ని భరిస్తూ వుండలేం. ఆ కారణం వల్లే తాను `ఆచార్య` నుంచి బయటికి వచ్చినట్టు త్రిష క్లారిటీ ఇచ్చింది. `ఆచార్య` బృందానికి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. త్వరలో మంచి సినిమాతో వస్తాను’ అని త్రిష తాజాగా ట్వట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Trisha Acharya Movie