నిర్భయ తర్వాత సీమ కుష్వాహా ఇప్పుడు హత్రాస్ బాధితురాలి కోసం పోరాటం

98
Nirbhaya lawyer to fight case of Hathras victim

నిర్భయ కేసును వాదించి గెలిపించిన ప్రముఖ మహిళా న్యాయవాది సీమా కుష్వాహా హాథ్రస్‌ బాధితురాలి కేసునూ వాదించనున్నట్టు సమాచారం. కాగా, సీమ గురువారం బాధితురాలి కుటుంబాన్ని కలిసే ప్రయత్నంగా ఆమెను పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు.

Nirbhaya lawyer to fight case of Hathras victim

సీమ కుష్వాహా మాట్లాడుతూ ”వారి తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు నన్ను కోరారు. అయితే అధికార యంత్రాంగం వారిని కలిసేందుకు అనుమతించటం లేదు.

Nirbhaya lawyer to fight case of Hathras victim

కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు” అని మీడియాతో అన్నారు. బాధితురాలి సోదరుడితో తాను సంప్రదింపులు జరుపుతున్నాని ఆమె తెలిపారు.

Nirbhaya lawyer to fight case of Hathras victim

డిసెంబర్‌ 16, 2012న దిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటనలో సీమా కుష్వాహా బాధితురాలి తరఫున వాదించి ఆ కేసును గెలిపించారు. ఇక హాథ్రస్‌ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

 ఈ కేసులో ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని అదనపు డైరక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఆరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు.

Nirbhaya lawyer to fight case of Hathras victim