కొత్త హంగులతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మహీంద్రా థార్

83
All New 2020 Mahindra Thar SUV India Launch

మహీంద్రా తన రెండోతరం థార్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని కనిష్ట ధరను రూ.9.8 లక్షలుగా, గరిష్ఠ ధరను రూ.13.75 లక్షలుగా (Ex Showroom) నిర్ణయించింది. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన సరికొత్త థార్‌ ఏఎక్స్‌, ఎల్‌ఎక్స్‌ మోడళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ సదుపాయాలతో వస్తోంది.

All New 2020 Mahindra Thar SUV India Launch

పెట్రోల్‌ వేరియంట్లు 2 లీటర్ల ఇంజిన్‌తో 150 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. డీజిల్‌ వేరియంట్లు 2.2 లీటర్ల ఇంజిన్‌తో 130 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 17.7 టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు అడ్వెంచర్‌ స్టాటిస్టిక్స్‌ డిస్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

All New 2020 Mahindra Thar SUV India Launch

శుక్రవారం నుంచి బుకింగులు తెరిచామని, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త థార్‌ మరోసారి అందరి మనసులనూ గెలుచుకుంటుందని, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుందని మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా విశ్వాసం వ్యక్తంచేశారు. థార్‌ను నాసిక్‌ ప్లాంట్‌లో తయారు చేశారు

All New 2020 Mahindra Thar SUV India Launch