బ్రేకింగ్.. బోరబండలో కంపించిన భూమి

88
earthquake

హైదరాబాద్ బోరబండలోని వీకర్స్‌ కాలనీ సైట్‌ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. అది భూకంపమా లేక భారీ శబ్దాలా అనేది తెలియాల్సి ఉంది.

earthquake

2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు పేర్కొన్నారు. కాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తన టీంతో కలిసి భారీ శబ్దాలు వినిపించిన సైట్‌-3 ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. భూ కంపనలకు సంబంధించి టివి9 తో (NGRI)భూకంప అధ్యయన హెచ్ వో డీ డాక్టర్ శ్రీనగేష్ మాట్లాడారు.

earthquake

బోరబండలో వచ్చిన శబ్దాలు భూకంపమేనన్నారు. బోరబండ సైట్ త్రీలో ప్రకంపనలు రేగాయని.. 1.4 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు ఎన్ జి ఆర్ ఐ గుర్తించిందని తెలిపారు. రాత్రి 8. 45 కి ఈ ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.

 Borabanda Earthquake