డైట్ చేయడం వల్ల బాలీవుడ్ నటి కిడ్నీ ఫెయిల్యూర్‌ తో

93
Mishti Mukherjee Passes away

బాలీవుడ్ లోని ఎన్నో చిత్రాల్లో, మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన మిస్టీ ముఖర్జీ శుక్రవారం ( అక్టోబర్ 2) రాత్రి మరణించారు. నటి కుటుంబ సభ్యుల ప్రకారం మిస్టీ చాలా కాలం నుంచి కీటో డైట్ పాటిస్తోంది. దీంతో ఆమె కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆమె ఊపిరి విడిచారు.

Mishti Mukherjee Passes away

ఆమె బెంగళూరులో తుది శ్వాస విడిచింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. మిస్టీ ముఖర్జీ తన తల్లి, తమ్ముడితో కలిసి నివసిస్తోంది. శనివారం ఉదయం కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఆమె పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Mishti Mukherjee Passes away

మిస్టీ తన జీవితాన్ని ‘లైఫ్ కీ తో లగ్గయి’ అనే చిత్రంతో ప్రారంభించింది. తరువాత పలు చిత్రాల్లో కనిపించి మంచి గుర్తింపు సాధించింది. సుభాష్ ఘయ్ 2014లో విడుదల చేసిన ‘కాంచి..ది అన్‌బ్రేకబుల్’ చిత్రంలో మిస్తి ముఖర్జీ ప్రధాన పాత్రను పోషించారు.

Mishti Mukherjee Passes away

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె..ఆ తర్వాత పలు బాలీవుడ్, బెంగాలీ, తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2019లో విడుదలైన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలోనూ ఆమె నటించారు.

Mishti Mukherjee Passes away