తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో బాధపడుతున్న మిల్కీబ్యూటీ

113
tamanna corona positive

క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్యులనే కాదు సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది.

Tamanna Corona Positive

ప్ర‌స్తుతం ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తుంది. త‌మ‌న్నాకు క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవ్వ‌డంతో పాటు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Tamanna Corona Positive

కొద్ది రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఫ్యామిలీతో పాటు సిబ్బంది అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించింది త‌మ‌న్నా. ఈ ప‌రీక్ష‌ల‌లో త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ గా తేల‌గా..త‌మ‌న్నాతోపాటు మిగిలిన సిబ్బందికి నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఇటీవ‌ల త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు క‌రోనా నుండి కోలుకోగా, ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు.

Tamanna Corona Positive