చనిపోయిన భర్త కటౌట్ తో , కన్నడ హీరో భార్య సీమంతం..

166
Chiranjeevi Sarja Meghana Raj

కొన్ని నెలల క్రితం ఆకస్మికంగా కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన స్టైల్‌గా నుంచున్నట్లు ఉన్న చిరంజీవి కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు.

Chiranjeevi Sarja Meghana Raj

అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వేడుకలో భాగంగా తన భర్త చిత్రపటంతో తీసుకున్న ఓ అపురూపమైన ఫొటోని షేర్‌ చేసింది మేఘన..

Chiranjeevi Sarja Meghana Raj

అందులో ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపై ఎప్పటికీ కూడా జరుగుతుంది. ఐ లవ్‌ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు.

Chiranjeevi Sarja Meghana Raj

మరోవైపు ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్‌ చూస్తుంటే‌.. ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Chiranjeevi Sarja Meghana Raj

హీరో అర్జున్ మేనల్లుడే చిరంజీవి సర్జా. కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించిన ఆయన నటి మేఘనారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా… ఆయన జ్ఞాపకాలు తనతోనే జీవితాంతం ఉంటాయని మేఘన పేర్కొన్నారు.

Chiranjeevi Sarja Meghana Raj

 

View this post on Instagram

 

@classycaptures_official my all time favourite!!!

A post shared by Meghana Raj Sarja (@megsraj) on