వకీల్ సాబ్ షూటింగ్‌లో.. నివేదా థామస్

126
vakeel saab

పవన్ కల్యాణ్ చాలాకాలం గ్యాప్ తరవాత నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం అప్టేట్ రానే వచ్చేసింది. బాలీవుడ్ లో హిట్ కొట్టిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హిందీలో వచ్చిన పింక్ సినిమాలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు. సినిమా ఇప్పటికే దాదాపు 90% పూర్తయినట్లు సమాచారం.

vakeel saab

సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

vakeel saab

లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన ఈ సినిమా చివరి షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్‌లో హీరోయిన్ నివేదా థామస్ జాయిన్ అయింది. ఈ మేరకు సెట్ ఫొటోను షేర్ చేస్తూ నివేదా.. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మళ్లీ షూటింగ్ కు తిరిగి రావడం ఆనందంగా ఉందంటూ నివేదా పేర్కొంది.

vakeel saab movie shooting starts actress nivetha thomas shared photo