గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహం.. అంతలోనే

99
Child Marriage

రాజధాని ఢిల్లీలో జామియా నగర్ కి చెందిన 13 ఏళ్ల బాలిక కి కుటుంబ సభ్యులు బాల్యవివాహం చేయడానికే సిద్ధపడగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ ఉమెన్ కమిషన్ 181 కి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ ఉమెన్ కమిషన్ అధికారులు హుటాహుటిన బాలిక ఇంటికి చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు.

Delhi Child Marriage

ఢిల్లీ ఉమెన్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఒక బృందంగా ఏర్పడి బాలిక ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇల్లు పెళ్లి కళతో కళకళలాడుతుంది. అయితే పెళ్లి కూతురి వయసు గురించి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా పెళ్లి వయసేనని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. కానీ పెళ్లికూతురు మేజర్ అని నిరూపించడానికి ఏ సర్టిఫికెట్ చూపలేకపోయారు.

Delhi Child Marriage

దాంతో పోలీసులు ఇంటి లోపల తాళం వేసిన గదిలో ఉన్న బాలికను రక్షించారు పోలీసులు. అలాగే బాల్య వివాహం చేయడానికి యత్నించిన బాలిక తల్లిదండ్రులను జమియా నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరి పై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Family tries to Delhi Child Marriage off 13-year-old daughter, teen rescued by DCW