‘లక్ష్మీబాంబ్’ ని బాయ్ కాట్ చేయాలంటూ సుశాంత్ ఫ్యాన్స్ నిరసన

113
laxmmi bomb trailer

అక్షయ్ నటించిన లక్ష్మీ బాంబ్ ట్రైలర్ నిన్న లాంచ్ అయింది. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు సోషల్ మీడియాలో #BoycottLaxmmiBomb అనే హ్యాష్ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కారణం అక్షయ్ కుమార్ సుశాంత్ ఘటనలో మద్దతు ఇవ్వకపోవడమే.

అలాగే ఈ వారం ప్రారంభంలో అక్షయ్ కుమార్ విడుదల చేసిన ఎమోషనల్ వీడియోను ప్రమోషనల్ స్టంట్ అంటూ విమర్శించారు. అక్షయ్ ను ‘ఫేక్ నేషనలిస్ట్’ అంటూ సుశాంత్ అభిమానులు నిందించారు. డిస్నీ హాట్ స్టార్ ట్రైలర్ కి సంబంధించినంత వరకూ ఓవర్ హీట్ ని ఎదుర్కొంటోంది. యూట్యూబ్ లో లైక్ లు డిస్ లైక్ ల ఆప్షన్ తీసివేయడం షాకిస్తోంది.

నవంబర్ 9 న లక్ష్మీ బాంబ్ తన ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం సంసిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కియారా అద్వానీ అక్కీ సరసన నాయికగా నటింంచింది. కొరియోగ్రాఫర్ కం దర్శకుడు లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

laxmmi bomb trailer #BoycottLaxmmiBomb