రాజమాత గౌరవార్థం 100 రూపాయల నాణెన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ

90
100 Rupee Coin

విజయరాజే సింధియా గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఆమె పేరిట 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. ఆమె శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్మారక నాణెన్ని సోమవారం ఉదయం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో మోదీ లాంచ్ చేశారు.

100 rupee coin

విజయరాజే సింధియా బిజెపి వ్యవస్తాపక సభ్యులలో ఒకరు. గత 60 ఏళ్లలో భారతదేశానికి ఓ దిశను చూపిన ప్రముఖ రాజకీయవేత్తలలో రాజమాత సింధియా ఒకరని చెప్పారు. ఆమె నిర్ణయాత్మక నాయకురాలని మోదీ అన్నారు.

స్వాతంత్య్రానికి ముందు విదేశీ దుస్తుల కాల్చడం మొదలుకుని, రామ మందిరం ఆందోళన వరకు ఆమె అనుభవం గొప్పదని గుర్తు చేసుకున్నారు. రామజన్మభూమి కోసం ఆమె చాలా కష్టపడ్డారని.. ఆమె శత జయంతి వేళ ఆ కల సాకారం అవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Modi releases special 100 Rupee Coin