ఫ్యాన్స్‌ని బురిడీ కొట్టించిన పునర్నవి

105
Punarnavi Engagement

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా నిశ్చితార్థపు ఉంగరం చూపించి.. హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఉద్భవ్ రఘునందన్ అనే నటుడిని ఆమె పెళ్లి చేసుకోబోతోందనే అర్థం వచ్చేలా తర్వాత ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్‌ అయ్యింది. రఘునందన్ కూడా పునర్నవితో కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి.. ఫైనల్‌గా ఆమె ఓకే చెప్పింది అంటూ.. ఇంక పెళ్లే అనేలా పోస్ట్‌లు చేశాడు.

అనుకున్నట్లుగానే అభిమానులను వీరిద్దరూ బురిడీ కొట్టించారు. పెళ్లి కాదు.. ప్రమోషన్‌ కోసమే వీరిద్దరూ ఇంత హడావుడి చేశారనేది తాజాగా వారు చేసిన పోస్ట్‌లు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ నటించబోతున్న ‘కమిట్‌ మెంటల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం.. పునర్నవి, ఉద్భవ్‌ ఇలా పెళ్లి డ్రామాలు ఆడారు.