7 నుంచి పట్టాలెక్కబోతున హైదరాబాద్ మెట్రో రైలు :Hyderabad Metro Rail Unlock

141
hyderabad metro rail unlock

  హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు సర్వీసులు దశలవారీగా ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. రైళ్ల మద్య ఫ్రీక్వెన్సీ సుమారు 5 నిమిషాలు ఉంటుంది. రద్దీ ఆధారంగా సర్వీసులను పెంచడం లేదా తగ్గించడం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లు గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ కి మాత్రం ఇంకా అందుబాటులో ఉండవనే అంటున్నారు.

Hyderabad Metro Rail Unlock

  ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఫేస్ మాస్కులు ధరించలేదంటే జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించారు. కరోనా లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో మాత్రమే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

Hyderabad Metro Rail Unlock

  7న మొదటి ఫేజ్‌లో భాగంగా మియపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ఓపెన్‌లో ఉండనుంది. అలాగే ఉదయం 7 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. ఇక 8వ తేదీన సెకండ్ ఫేజ్‌లో భాగంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. 9వ తేదీన థర్డ్ ఫేజ్ అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు నడవనున్నాయి.

Hyderabad Metro Rail Unlock