తిరిగి ఇంటికి వెళతాను అనుకోలేదు.. జెనీలియా :Genelia Covid

126
Genelia covid Shares corona experience

 బాలీవుడ్ తో పాటు తెలుగు తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా కరోనా బారిన పడి చికిత్స ద్వారా కోలుకున్నారు. ఇటీవలే క్వారంటైన్ పీరియడ్ ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. కరోనా సోకినప్పుడు తాను పడ్డ ఇబ్బందుల గురించి జెనీలియా సోషల్ మీడియా ద్వారా NDTV వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా పలు విషయాలను వెల్లడించింది.

genelia covid

 ‘నాకు కరోనా వచ్చిందని తెలిసాక షాక్ అయ్యాను. కారణం నాకు ఒక్క కరోనా లక్షణం కూడా కనిపించలేదు. కానీ రిపోర్ట్ లో పాజిటివ్ అని తేలింది. మా ఇంట్లో ఒక వ్యక్తికి వైరస్ సోకగా.. అందరం పరీక్షలు చేయించుకున్నాం. నాకు మాత్రమే పాజిటివ్ అని తేలింది. నిజంగా పరీక్షలు చేయించుకోకుంటే బయట కూడా పడేది కాదేమో.

genelia covid

 వైరస్ సోకినట్లు తెలియగానే వెంటనే వేరే ఇంటికి మారిపోయా. 21 రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్నాను. ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి.

genelia covid

 ఒకవేళ వైరస్ నుంచి బయటపడ లేకపోతే ఎలా. పిల్లల పరిస్థితి ఏమిటి అని చాలా ఆందోళన చెందాను. చాలా కష్టంగా గడిచింది.కానీ రితీష్ నన్ను పిల్లలను ఎంతో బాగా చూసుకున్నాడు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నా’ అని జెనీలియా చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad) on

Genelia Covid